మన ముఖ్యమంత్రి మాత్రం 'అక్కరకు రాని చుట్టం'లా అమెరికాలో ఉన్నారు: నారా లోకేశ్
- ఈ ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి
- ఆయా రాష్ట్రాల సీఎంలు వేగంగా స్పందించారు
- ఇప్పటికే సాయం కూడా ప్రకటించారు
ఏపీలో కృష్ణానదికి వరద కారణంగా ముంపు ప్రాంతాల్లోని నివాసాలు, పంటపొలాలు నీట మునగడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ, వరద బాధితులకు ప్రభుత్వం ఇంత వరకూ సాయం ప్రకటించలేదంటూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఈ ఏడాది దేశమంతటా అనేక రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించి వరదబాధితులకు అండగా నిలుస్తూ ఇప్పటికే సాయం ప్రకటించారని అన్నారు. అయితే, సీఎం జగన్ మాత్రం 'అక్కరకు రాని చుట్టం'లా అమెరికాలో సొంతపనుల్లో బిజీగా ఉన్నారంటూ చేసిన వరుస ట్వీట్లలో విమర్శించారు.